కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- March 25, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఒక ఇంధన ట్యాంక్ లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగిందని, ఫలితంగా అక్కడ అగ్నిప్రమాదం సంభవించిందని కువైట్ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.
ప్రాథమిక నివేదికల ప్రకారం కేవలం ఆస్తి నష్టానికే పరిమితమైంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-రాజీ తెలిపారు.
అత్యవసర ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్స్ ను వెంటనే అమలు చేశామని, మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక బృందాలు వేగంగా రంగంలోకి దిగాయని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, ఘటన ప్రభావాన్ని అంచనా వేస్తున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







