ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- March 25, 2026
మస్కట్: కొనసాగుతున్న అల్పపీడన వాతావరణ వ్యవస్థ వల్ల ప్రభావితమైన పలు గవర్నరేట్లలో 93 మందికి ఆశ్రయం కల్పించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ కమిటీలోని రిలీఫ్ మరియు షెల్టర్ విభాగం వెల్లడించింది.
ముసందమ్ గవర్నరేట్‌లోని ఖసాబ్‌లో ఒక ఆశ్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఖాదా గ్రామానికి చెందిన 23 మందికి వసతి కల్పించారు.
దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో బర్కాకు చెందిన ఐదుగురు సభ్యుల కుటుంబానికి చెందిన ఇల్లు దెబ్బతినడంతో వారిని ఒక హోటల్‌కు తరలించారు.
ఇదిలా ఉండగా, మస్కట్ గవర్నరేట్‌లో ఇల్లు దెబ్బతినడంతో మరో నలుగురు సభ్యుల కుటుంబాన్ని సమీపంలోని హోటల్‌కు తరలించారు.
అల్ దఖిలియా గవర్నరేట్‌లోని ఆడమ్ విలాయత్‌లో ఉన్న షెల్టర్ ముందుజాగ్రత్త చర్యగా ప్రస్తుతం 61 మందికి ఆశ్రయం కల్పించింది.
పరిణామాలకు ప్రతిస్పందించడానికి తాము నిరంతరం సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పాగా, ప్రజా భద్రతను నిర్ధారించడానికి సంబంధిత సంస్థలతో సమన్వయం కొనసాగుతోందని అథారిటీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







