విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!

- March 26, 2026 , by Maagulf
విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!

రియాద్ః ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతీయ యుద్ధం నేపథ్యంలో ఫిబ్రవరి 25న వీసాల గడువు ముగిసిన విజిటర్స్ తమ వీసాలను పొడిగించుకోవడానికి సౌదీ అరేబియా అనుమతి జారీ చేసింది.ఈ మేరకు విజిట్, ఉమ్రా, ట్రాన్సిట్ మరియు ఫైనల్ ఎగ్జిట్ వీసాలతో సహా ప్రభావిత వీసా హోల్డర్లకు రెండు ఎంపికలను అందిస్తున్నట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ప్రకటించింది.

విజిటర్స్ అవసరమైన ఫీజులను చెల్లించిన తర్వాత, అబ్షర్ ప్లాట్‌ఫామ్ ద్వారా తమ గడువు ముగిసిన వీసాలను ఏప్రిల్ 18 వరకు పొడిగించుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా, వారు తమ వీసాలను పునరుద్ధరించుకోకుండా లేదా జరిమానాలు చెల్లించకుండా అంతర్జాతీయ ఎగ్జిట్ పాయింట్ల ద్వారా నేరుగా సౌదీ అరేబియాను విడిచి వెళ్ళవచ్చని తెలిపింది.అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com