మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- March 26, 2026
అమరావతి: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన భీకర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ దుర్ఘటనకు గల కారణాలను అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం, బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ సమీక్షలో హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి జనార్దన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రమాదం తీరుపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు జిల్లా కలెక్టర్, ఎస్పీ వివరించారు.ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. వారిలో 13 మంది మృతిచెందగా.. 22 మంది గాయపడినట్లు వివరించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణలో జగిత్యాల నుంచి వస్తున్నట్లు చెప్పారు. బస్సు డ్రైవర్‌ను విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు చెప్పారని సీఎంకు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







