అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్‌లలో భారీ వర్షాలు..!!

- March 26, 2026 , by Maagulf
అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్‌లలో భారీ వర్షాలు..!!

మస్కట్ః అల్ జబల్ అల్ అఖ్దర్, అదఖిలియా గవర్నరేట్‌లోని అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్‌లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాలతోపాటు బలమైన గాలులు మరియు వడగళ్లు కూడా పడ్డాయి.  దీంతో సైక్, వాడి కతమ్, అల్ మనాఖిర్, హైల్ అల్ ముస్బాత్, అల్ షురైజా, వాడి బని హబీబ్, అల్ సవ్జరా, అల్ రూస్ మరియు హైల్ అల్ యమన్ వంటి అనేక వాడీలు (నదీ లోయలు) పొంగి ప్రవహించాయి. అంతేకాకుండా, వాడీలు మరియు నీటి ప్రవాహాలు ఉధృతంగా ప్రవహించడం వల్ల అనేక భూగర్భ జలాల పునరుద్ధరణ ప్రాజెక్టులు (recharge dams) నిండుకుండలా మారాయని అధికారులు తెలిపారు.

దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని అరుస్తాక్ విలాయత్‌లో  భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. విలాయత్ కేంద్రంతోపాటు బని గఫిర్, బని హని, అల్ సహ్తాన్ మరియు బని అవ్ఫ్ వాడీల ప్రాంతాలపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉందని, దీనివల్ల ఆయా ప్రాంతాలలోని వాడీలు మరియు నీటి ప్రవాహాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com