టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం

- March 26, 2026 , by Maagulf
టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ రోడ్డు ప్రమాదం అత్యంత దిగ్భ్రాంతికరమైనది. మార్కాపురం సమీపంలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 14 మంది ప్రయాణికులు సజీవదహనం కావడం తీరని విషాదం నింపింది..జగిత్యాల నుంచి వింజమూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం, క్షణాల్లోనే మంటలు వ్యాపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.మృతులంతా కనిగిరి, పామూరుకు చెందినవారిగా చెబుతున్నారు. అందరూ చూస్తుండగానే బస్సు మంట్లలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది..

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పేసి.. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి పామూరు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం ఉదయం 6-6.30 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. రాయవరం పలకల క్వారీల దగ్గర బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో టిప్పర్‌ ఢీకొట్టినట్లు సమాచారం.

స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. టిప్పర్‌ అతివేగమే ఈ ఘటనకు కారణం అంటున్నారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలోబస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు.మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com