CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- March 26, 2026
యూఏఈ: ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో మిడిలీస్టు అంతటా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు కావడంతో చాలా మంది ప్రణాళికలు తలకిందులయ్యాయి. అయినప్పటికీ, యూఏఈ వ్యాప్తంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు వారి ఫలితాలు, విద్యా భవిష్యత్తు సురక్షితంగానే ఉన్నాయని భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ కారణంగా తీసుకున్న ఈ నిర్ణయం, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చినప్పటికీ గ్రేడింగ్, ఫలితాలు, తదుపరి చర్యల గురించి వారిలో అనేక సందేహాలను లేవనెత్తింది.
ఈ క్రమంలో నెలల తరబడి సన్నద్ధమైన విద్యార్థులు ఇప్పుడు సవరించిన ఇవాల్యుయేషన్ విధానానికి అలవాటు పడుతున్నారు. ఆందోళనలను తగ్గించడానికి మార్కింగ్ ప్రమాణాలపై స్పష్టత కీలకంగా మారింది. ఏ విద్యార్థి కూడా నష్టపోడనే విశ్వాసాన్ని పెంపొందిస్తూ రూపొందించిన ఒక ప్రత్యేక ఇవాల్యుయేషన్ పథకాన్ని CBSE ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
హైబ్రిడ్ మోడల్
CBSE ఒక హైబ్రిడ్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. ఇది పూర్తయిన పరీక్షల మార్కులను, నిర్వహించలేని పేపర్ల కోసం లెక్కించిన సగటులతో కలుపుతుంది. కోల్పోయిన అవకాశాల ఆధారంగా కాకుండా, విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా వారిని ఇవాల్యుయేషన్ చేయడమే దీని లక్ష్యమని ఫ్యాకల్టీ తెలిపారు.
జెమ్స్ న్యూ మిలీనియం స్కూల్ ప్రిన్సిపాల్ మరియు సీఈఓ అయిన ఫాతిమా మార్టిన్ ఈ విధానాన్ని వివరించారు. ఈ స్కీమ్ నిష్పక్షపాతంగా మరియు ప్రపంచవ్యాప్తంగా అనుగుణంగా ఉండేలా రూపొందించబడిందని అన్నారు. ఈ నమూనా విద్యార్థులను నష్టపోకుండా ఇవాల్యుయేషన్ చేస్తుందన్నారు.
ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, తమ పరీక్షలన్నీ పూర్తి చేసిన విద్యార్థులను వారి వాస్తవ ప్రతిభ ఆధారంగా ఇవాల్యుయేట్ చేస్తారు. పరీక్షలు రాయని వారికి, వారు అత్యుత్తమంగా రాణించిన సబ్జెక్టుల నుండి పొందిన సగటులను ఉపయోగించి CBSE మార్కులను లెక్కిస్తుంది.
ఉదాహరణకు, నాలుగు పరీక్షలకు హాజరైన విద్యార్థులకు, వారు రాయనటువంటి పేపర్‌కు వారి ఉత్తమ మూడు సబ్జెక్టుల సగటును వర్తింపజేస్తారు. అదేవిధంగా తక్కువ పరీక్షలకు హాజరైన వారికి తదనుగుణంగా సబ్జెక్ట్ యావరేజీలను లెక్కిస్తారు. ఈ పారదర్శక, గ్రేడెడ్ విధానం ప్రతి విద్యార్థిని సమూలంగా అంచనా వేస్తుందని మార్టిన్ తెలిపారు. ఇది ఫలితాలు ప్రపంచవ్యాప్త CBSE విద్యార్థులతో పోల్చదగినవిగా ఉంటాయనే విశ్వాసాన్ని బలపరుస్తుందని పేర్కొన్నారు.
ది రాయల్ అకాడమీ అజ్మాన్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ మురళీధర్ ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. పూర్తి చేసిన పరీక్షలలోని ప్రతిభ ఆధారంగా, రాయలేకపోయిన సబ్జెక్టులలో మార్కులు కేటాయించేందుకు సీబీఎస్ఈ ఒక నిర్మాణాత్మక ఇవాల్యుయేషన్ విధానాన్ని అమలు చేసిందని ఆమె వివరించారు. ప్రమాణీకరణ, విశ్వసనీయత, మరియు ప్రపంచవ్యాప్త విద్యార్థులతో సమానత్వం ఉండేలా చూసేందుకు, గణాంక మోడరేషన్ మరియు యావరేజ్ పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇంప్రూమెంట్ ఎగ్జామ్స్ మరియు భవిష్యత్ అవకాశాలు
ఈ అంతరాయం వల్ల ఫలితాలు ఆలస్యం అవుతాయా లేదా ఉన్నత విద్యా ప్రణాళికలపై ప్రభావం పడుతుందా అనేది స్టూడెంట్స్, పేరెంట్స్ లలో ఉన్న అతిపెద్ద ఆందోళనలలో ఒకటి. ప్రపంచ షెడ్యూల్‌కు అనుగుణంగా,= ఫలితాలను సకాలంలో ప్రకటిస్తామని సీబీఎస్ఈ ఇదివరకే ధృవీకరించింది.
భారత్ మరియు విదేశాలలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సకాలంలో తమ ఫలితాలను పొందేలా సీబీఎస్ఈ చర్యలు తీసుకుంటుందని డాక్టర్ మురళీధర్ తెలిపారు. అదే సమయంలో విద్యార్థులకు వారి స్కోర్లను మెరుగుపరచుకోవడానికి రెండవ అవకాశం ఇస్తూ, ఇంప్రూమెంట్ పరీక్షలను అందించే తన విధానాన్ని కూడా సీబీఎస్ఈ కొనసాగిస్తోందని తెలిపారు. సాధారణంగా మే మరియు జూన్ నెలల మధ్య నిర్వహించబడే ఈ పరీక్షలు విద్యా సంస్కరణలకు అనుగుణంగా ఉంటాయన్నారు.
వుడ్లెమ్ పార్క్ అజ్మాన్ ప్రిన్సిపాల్ భాను శర్మ మాట్లాడుతూ.. ఈ పరిస్థితి స్టూడెంట్స్ తోపాటు వారి పేరెంట్స్ పై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిందని అంగీకరించారు. ఈ పరిస్థితి విద్యార్థులు మరియు తల్లిదండ్రులలో ఆందోళన కలిగించడం సహజమే అని అన్నారు. అయితే, విద్యార్థుల విద్యా పురోగతికి ఆటంకం కలగకుండా చూసేందుకు సీబీఎస్ఈ వ్యవహరించిందని తెలిపారు. ఈ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యాపరమైన మరియు మానసిక సవాళ్లను అధిగమించడంలో సహాయపడటానికి, యూఏఈ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు మార్గదర్శకత్వం మరియు కౌన్సెలింగ్ ద్వారా వారికి మద్దతుగా నిలుస్తున్నాయని వెల్లడించారు.
సీబీఎస్ఈ సాంప్రదాయకంగా మే మరియు జూన్ నెలల మధ్య ఇంప్రూమెంట్ లేదా రెండవ దశ పరీక్షలను నిర్వహిస్తుందని, విద్యార్థులు హాజరై, మెరుగైన స్కోరును నిలుపుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనూ తమ ప్రయత్నాలకు సరైన గుర్తింపు లభిస్తుందనే నమ్మకంతో విద్యార్థులు ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ
- ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్..
- శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం









