రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్ర‌ధాని మోడీ కీల‌క సమావేశం

- March 26, 2026 , by Maagulf
రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్ర‌ధాని మోడీ కీల‌క సమావేశం

న్యూ ఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల దేశంపై పడే ప్రభావం, భవిష్యత్తు పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచనలు చేయనున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ అంశంపై మాట్లాడిన ఆయన, యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని, ఇది భారత్‌కు కూడా సవాలుగా మారిందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు వంటి అత్యవసర వస్తువుల సరఫరా మార్గాలకు ఆటంకం కలగకుండా చూడటం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. అయితే, దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, ఇంధన భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని అఖిలపక్ష సమావేశం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com