నా సినిమాలకు ప్రశంసలే కాదు డబ్బులు కూడా వస్తాయని ‘పాపం ప్రతాప్’ నిరూపిస్తుంది: హీరో తిరువీర్
- March 26, 2026
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ ప్రధాన పాత్రలో, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన వైవిధ్యభరిత చిత్రం ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్గా రిలీజైన టీజర్‌కు మంచి అప్లాజ్ వస్తోంది. ఇప్పటివరకు ప్రేమలో గెలిచాం..పెళ్లి తర్వాత ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్న ఓ జంట చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది. ‘రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవైనా జరిగినా.. ఆ గొడవ వల్ల నా పరువు పోయినా.. గుర్తుపెట్టుకో నీ బతుకు నా చేతిలో చేతబడి బొమ్మేరోయ్’ అంటూ హీరో తండ్రి డైలాగ్‌తో ఆసక్తికరంగా టీజర్ ఉంది. థియేటర్లలో ఫన్ రైడ్ చేయించే ఈ నవ్వుల బ్లాక్ బస్టర్‌ను ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకుంది.
ఈ సందర్బంగా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ..‘‘పాపం ప్రతాప్ టీజర్ చాలా బాగుంది. ఈటీవీ విన్ ఇలాంటి కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తూ కొత్త కథలను తెస్తున్నందుకు హ్యాట్సాఫ్. రాకేష్ నాకు శుభం సినిమా నుంచి తెలుసు. తను ఎప్పుడూ ఒక మంచి సినిమా తీయాలని తాపత్రయపడే వ్యక్తి. లాస్ట్ ఇయర్ అనగనగా అనే ఒక బ్యూటీఫుల్ మూవీతో ఆకట్టుకున్నారు. ఈ సారి పాపం ప్రతాపం కూడా మంచి కమర్షియల్ హిట్ అవ్వాలి. నిర్మాతలకు మంచి డబ్బులు వచ్చే సినిమా అవుతుందనిపిస్తోంది. తిరువీర్ ప్రీవెడ్డింగ్ షోకి అందరూ అప్రిషియేట్ చేశారు. తను చేస్తున్న అన్ని సినిమాల్లో ఇది పక్కా కమర్షియల్ అవుతుంది. తిరువీర్లోని నెక్ట్స్ లెవెల్ యాక్టింగ్ ఈ సినిమాలో చూడబోతున్నాం. ’’ అని చెప్పారు.
యాక్టర్ ప్రసాద్ బెహరా మాట్లాడుతూ...‘‘సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య అలకలు, గిల్లిగజ్జాలు బాగుంటాయి. మంచం మీద పాపం ప్రతాప్ ఏం చేశాడు అనేది కాదు.. నవ్వులు పూయించేలా ఈ సినిమా ఉంటుంది. తిరువీర్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఈటీవీ విన్ వాళ్లకు మంచి అదృష్టం పట్టింది. సరైన జడ్జిమెంట్ ఉన్న క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ వల్లే ఇన్ని విజయాలు సాధ్యమవుతున్నాయి. ఈ సినిమాలో బత్తోడు అనే క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర నాకు మంచి గుర్తింపు తీసుకొస్తుంది. అందరూ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి.’’ అని చెప్పారు.
నిర్మాత రుద్రదేవ్ మాదిరెడ్డి మాట్లాడుతూ..‘‘డైరెక్టర్ దుర్గ నరేష్ స్టోరీ చెప్తుంటే ఫస్టాఫ్ నెరేషన్లో ఆయన ప్యాషన్, హార్డ్ వర్క్ అర్థమయ్యాయి.గడ్డం రాకేష్ రెడ్డి లాంటి పార్ట్నర్ ఉంటే సినిమా ఈజీగా చేయొచ్చు.ఇండస్ట్రీలో నేను ఎవరికీ తెలీదు.ఆయనే మొత్తం నడిపించారు. తిరువీర్ అమేజింగ్ ఆర్టిస్ట్.ఈటీవీ విన్ నుంచి సాయిగారు బాగా సపోర్ట్ చేశారు.క్రియేటివ్ ప్రొడ్యూసర్ కిషోర్ వల్లే ఇంత మంచి అవుట్‌పుట్ వచ్చింది. సినిమాను అందరూ చూసి ఆదరించండి’’ అని కోరారు.
నిర్మాత గడ్డం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ..‘‘ఈటీవీ విన్‌తో ఇది నా సెకెండ్ ప్రాజెక్ట్. సాయి, నితిన్ కి థ్యాంక్యూ వెరీమచ్. బాపినీడు కి స్పెషల్ థ్యాంక్స్.ఈ సినిమాలో రాశి, అజయ్ ఘోష్, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు ఇలా చాలా మంచి కాస్ట్ ఉంది. అప్పట్లో జంధ్యాల సినిమాలో చూసినట్లు ఈ సినిమాలో నటీనటులను చూస్తారు. థియేటర్లలో నవ్వులు గ్యారెంటీ సినిమా ఇది. ఈ సినిమా చాలా బాగా ఆడితే ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తాం. మా సంస్థ నుంచి కొత్త వాళ్లనే ఎంకరేజ్ చేస్తాం.’’ అని తెలిపారు.
మూవీ డైరెక్టర్ దుర్గ నరేష్ మాట్లాడుతూ..‘‘రామోజీ రావుకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. నా జర్నీ 2013లో మొదలైంది. అప్పటి నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నా. నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఏజ్ మాత్రమే. నా లైఫ్ దీని మీద పెట్టేశాను. నాకు ఎక్కడ ఇబ్బంది కలిగినా సినిమా ఆపుకుంటూనే వచ్చా. సినిమా ఫెయిల్యూర్ అవుతుందనే చోట నేను చేయలేదు. ఎలాగైనా హిట్ కొట్టాలనే టార్గెట్‌తోనే నిలబడి ఉన్నా. ఈ రోజు గ్యారెంటీ ఇస్తున్నా.. పాపం ప్రతాప్.. మామూలు సినిమా అవదు. రాసి పెట్టుకోండి.. కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తా. నిర్మాతలు ఫ్రీడం ఇవ్వడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. మనం కమర్షియల్ బడ్జెట్లో పడి, ఒరిజినల్ సినిమాలను, కథలను వదిలేస్తున్న ఈ టైమ్‌లో నేను మళ్లీ ప్రపంచాన్ని తీసుకురావాలని ప్రయత్నించాను.ఈ సినిమా పక్కా సూపర్ హిట్ అవుతుంది’’ అని చెప్పారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ..‘‘పాపం ప్రతాప్ వీర ప్రతాప్‌గా ఎలా మారాడన్నదే ఈ సినిమా కథ. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల అవుతోంది. పాన్ ఇండియా సినిమాలతో తెలుగు సినిమా స్కేల్ పెంచుకుంటున్న ఈ టైమ్‌లో ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాలాగా, ఈవీవీ గారి సినిమాలాగా, జంధ్యాల గారి సినిమాలాగా ఉన్న సినిమాలు రావట్లేదు. అందుకే అలాంటి సినిమాను మళ్లీ అందరికీ చూపించడానికి పాపం ప్రతాప్ వస్తోంది. టీజర్ ఎలా ఉందో సినిమా కూడా అలాగే ఉంటుంది. ఫన్ ప్లస్ ఎమోషన్స్ కలగలిపి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అందరూ థియేటర్లలో ఏప్రిల్ 17న చూసి ఎంజాయ్ చేయండి’’ అని చెప్పారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ...‘‘నాకు చిన్నప్పుడు సినిమాల గురించి తెలిసింది ఈటీవీ ద్వారానే. ఈరోజు ఈటీవీ విన్‌తో సినిమా చేశా. గతంలోనే వీరాంజనేయులు విహారయాత్ర సినిమా నేను చేయాల్సింది. కానీ అప్పట్లో థియేటర్ సినిమాలే చేయాలని నాకు ఉండింది. ఈ రోజు నా లైనప్ చూస్తే నా నెక్ట్స్ సినిమా ఈటీవీ విన్ నుంచి వస్తోంది. ధైర్యంగా ఉండొచ్చు అనిపిస్తోంది. చాలా షార్ట్ పిరియడ్‌లో ఈటీవీ విన్ మంచి పేరు తెచ్చుకుంది. నరేష్ ఈ కథ పట్టుకుని చాలా తిరిగాడు. అతని కోసమే ఈ సినిమా చేయాలనిపించింది. నరేష్ ఏం చెప్పాడే అది విని ఈ సినిమా చేసుకుంటూ వెళ్లా. నా సినిమాలకు ప్రశంసలు మాత్రమే కాదు.. డబ్బులు కూడా వస్తాయని ఈ సినిమా నిరూపిస్తుంది. ఏప్రిల్ 17న మీకు టీజర్‌ను మించిన ఫన్ ఇస్తుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు. ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే సినిమా. థియేటర్లలో కలుద్దాం’’ అని చెప్పారు.
తారాగణం:
తిరువీర్, పాయల్ రాధాకృష్ణ, రాశి, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, రఘు బాబు, గోపరాజు రమణ, దేవి ప్రసాద్, రవి ఆంథోనీ, ప్రసాద్ బెహరా, అనంత బాబు, బాషా తదితరులు.
సాంకేతిక బృందం:
రచన & దర్శకత్వం: ఎస్.పి. దుర్గ నరేష్
నిర్మాతలు: గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మధి రెడ్డి
నిర్మాణ సంస్థలు: ఈటీవీ విన్, కృషి ఎంటర్టైన్మెంట్స్
సంగీత దర్శకుడు: కె.ఎం. రాధాకృష్ణ
నేపథ్య సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్ ఎస్.వి
ఎడిటర్: అన్వర్ అలీ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, అనంత శ్రీరామ్, రహమాన్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ ములే
కాస్ట్యూమ్ డిజైనర్స్: ప్రియాంక విన్నకోట, ఆర్తి వీరబోయిన
సౌండ్ డిజైన్: వందన, వరుణ్
కొరియోగ్రాఫర్: ఈశ్వర్ పెంటి
పీఆర్ఓ: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









