రాఘవ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన SITSA కర్టన్ రైజెస్ ఈవెంట్
- March 29, 2026
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సౌత్ ఇండియన్ టీవీ సీరియల్ అవార్డ్స్ (SITSA) కర్టెన్ రైజర్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు సీరియల్ ప్రముఖులు, యాక్టర్లు, డైరెక్టర్లు, నిర్మాతలు హాజరయ్యారు. టెలివిజన్ సీరియల్ పరిశ్రమను గౌరవించడమే లక్ష్యంగా మొదలైన SITSA అవార్డ్స్, దక్షిణ భారతదేశంలో నాలుగు భాషల సీరియల్స్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించనుంది. ఇంతవరకు ప్రతి ఛానల్ తన సొంత అవార్డులు విడివిడిగా నిర్వహించేది. ఇప్పుడు నాలుగు భాషలు, నాలుగు రాష్ట్రాలను ఒకేసారి గౌరవించడం ఇండస్ట్రీలో మైలురాయిగా కాబోతుంది.
కర్టెన్ రైజర్ ఈవెంట్‌లో నామినేషన్లు, ఓటింగ్ విధానం, ఎక్స్‌పెక్టెడ్ నామినీలు, సీరియల్ ఆర్టిస్టుల పాల్గొన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు మధు గారికి, రాఘవి మీడియా టీమ్‌కి అందరూ ధన్యవాదాలు తెలిపారు. టెలివిజన్ పరిశ్రమ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలాంటి అవార్డ్ ఫంక్షన్ ఇదే మొదటిసారి. ఈవెంట్‌లో మాట్లాడిన ప్రముఖులు.. టీవీ కళాకారులు, టెక్నీషియన్లు గత 50 ఏళ్లుగా ప్రతి ఇంట్లోకి వెళ్తున్నా, వారికి గుర్తింపు ఇవ్వడంలో జరిగిన లోపాలను గుర్తు చేశారు. ప్రభుత్వాలు, సంస్థలు ముందుకు రాకపోవడం వలన చిన్న చిన్న సంస్థలే అవార్డులు ఇచ్చేవి. ఇప్పుడు రాఘవి మీడియా ద్వారా సౌత్ ఇండియా మొత్తం టీవీ పరిశ్రమకు గౌరవం లభించడం గర్వకారణమని అందరూ అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో తెలుగు డైరెక్టర్, టీ.వీ డైరెక్టర్ అసోసియేన్ యాట సత్యనారణ మాట్లాడుతూ... ఇలాంటి వేడుకను ఇంత వరకు ఎప్పుడూ చూడాలేదన్నారు. టీవీ ప్రస్థావన మొదలై 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ను ఒకే తాటిమీదకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. దీనికి మధుగారి కృషి చాలా ఉందన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని తెలిపారు. ఈ వేడుక హైదరాబాద్ లో విజయవంతంగా జరగాలని, అందుకు కావాల్సిన సహకారాలను అందిస్తామని పేర్కొన్నారు.
సీనియర్ యాక్టర్ ప్రభాకర్ గారు మాట్లాడుతూ.. మధు దృఢ సంకల్పం, టీమ్ పట్టుదల ఇంతవరకు తీసుకొచ్చింది. చాలా మంది ఇలాంటి వేడుకలను నిర్వహించాలని ముందుకు వచ్చారు. కానీ తరువాత తలెత్తిని ఆర్థిపరిస్థితుల దృష్ట్యా వెనుక్కి వెళ్లారు. కానీ ఎన్నో ఏళ్ల కల.. ఈ రోజు తీరబోతుందని, అందుకు కారణం అయినా మధు, మిసెస్ మధు ఇతరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లో ఈవెంట్ జరపడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పనో అందరికీ తెలిసిందే. అన్ని భాషల నుంచి ఆర్టిస్టులను తీసుకురావడం, ఫ్లైట్ టికెట్స్, హోటల్స్, ట్రావెలింగ్ ఇలా ఎన్నో ఉంటాయి. వాటిన్నింటి దృష్టిలో పెట్టుకోని ముందుకొచ్చిన మధుకు ధన్యవాదాలు తెలిపారు.
టీ.వీ ఆర్టిస్ట అసోసియేషన్ ప్రెసిడెంట్ యాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ.. సైమా చూసినప్పుడు సీరియల్స్ కూడా ఇలా ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది. కానీ చాలా ఖర్చుతో కూడుకున్న విషయమని తెలిసే సైలెంట్ అయ్యాము. కానీ ఇన్నాళ్ల తరువాత మళ్లీ ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టటం గొప్ప విషయం. ఈ క్రెడిట్ అంతా మధు గారిదే ఈ ఈవెంట్ విజయవంతం కావాలని, ప్రతి సంవత్సరం ఇలాగే గ్రాండ్‌గా జరగాలని కోరుకున్నారు. నాలుగు భాషల కళాకారులు ఒకేచోట కలవడం ఇంకా ప్రత్యేకతను సంతరించుకోబోతుందని తెలిపారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న మధు గారు, మిసెస్ మధు గారు, రాఘవి మీడియా టీమ్‌కి అందరూ అభినందనలు తెలిపారు. టీవీ కళాకారులు, టెక్నీషియన్లు, నిర్మాతలు తమ కష్టానికి గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ ఈవెంట్ సౌత్ ఇండియన్ టీవీ సీరియల్ పరిశ్రమలో ఒక కొత్త చరిత్రను సృష్టించడం ఖాయమని పేర్కొన్నారు.
SITSA అవార్డ్స్ నిర్వహకులు మధు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా సీరియల్స్ కు కాస్టింగ్ డైరెక్టర్ గా పని చేశాను. అన్ని భాషలకు కూడా ఆర్టిస్టులను అందించాను. ఎప్పటినుంచో ఇలాంటి ఈవెంట్ చేయాలని ఉండేది. ఇన్నాళ్లకు కల నెరవేరబోతుందని అన్నారు. ఈ ఈవెంట్ చేయాలనుకున్నప్పటి నుంచి ప్రభాకర్ గారితో, కౌశిక్ గారితో అలాగే ఇతర పెద్దలతో కూడా మాట్లాడుతూ ఉన్నానని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ కోసం చాలా మంది కష్టపడుతున్నారని పేర్కొన్నారు. సిస్టా టీమ్ మెంబర్స్ సాయి, తేజ అలాగే టీమ్ లో ఉన్నవారందరికీ థ్యాంక్స్ చెప్పారు. SITSA అవార్డ్స్ మెయిన్ ఫంక్షన్ ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో సాయంత్రం 5 గంటలకు జరగనుంది. నామినీలందరికీ హార్దిక అభినందనలు తెలిపారు. ఈ ఈవెంట్ దక్షిణ భారత టీవీ పరిశ్రమకు కొత్త ఊపిరి పోస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో SITSA ఛైర్ పర్సన్ సుధా హెరమత్ గారు, నిర్మాత తేజ గారు, సహనా గారు, శృతి, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









