అమలాపాల్,విజయ్ విడిపోతున్నారు...
- August 03, 2016
'బెజవాడ', 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' సినిమాల ద్వారా సుపరిచితురాలయ్యారు నటి అమలాపాల్. ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం కూడా ఆమె పలు సినిమాల్లో నటించారు. తన భర్త విజయ్ నటించడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని కూడా ఆమె పలుమార్లు ప్రస్తావించారు. అయితే కొంతకాలంగా వీరిరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది. వీరిద్దరు విడిపోయారని పలు పత్రికలు కూడా ఇటీవల వార్తలు రాస్తూ పలు కారణాలను ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో విజయ్ బుధవారం స్పందిస్తూ కొంత కాలంగా తనకు, అమలాపాల్‌కు సంబంధించి పలు వార్తలు వస్తున్నాయని, తాను, అమలాపాల్ విడిపోతున్నామన్న విషయం నిజమేనని ప్రకటించారు. విడిపోవడానికి సంబంధించిన వార్తల్లో వచ్చిన కారణాల్లో ఏమాత్రం నిజం లేదని, తాము విడిపోతున్నందుకు కారణమేమిటో తనకు మాత్రమే తెలుసునన్నారు. తన స్నేహితులు, కొందరు మీడియా మిత్రులు కారణం చెప్పమని అడిగినా తన వ్యక్తిగత విషయాన్ని పంచుకోవడం ఇష్టం లేక చెప్పలేదన్నారు. మహిళలపై, సమాజంపై గౌరవం ఉన్న వ్యక్తినని, అందువల్లే తాను దర్శకత్వం వహించిన తొమ్మిది సినిమాల్లోనూ వారి ఆత్మగౌరవం ప్రతిబింబించేలా స్త్రీల పాత్రలను చిత్రీకరించానన్నారు. పెళ్లి తర్వాత కూడా నటించాలని అమలాపాల్ కోరడంతో సంతోషంగా సరేనన్నానని పేర్కొన్నారు. కానీ ఆమె సినిమాల్లో నటిస్తున్నందువల్లే తాము విడిపోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ సత్యదూరమేనన్నారు. తామిద్దరం విడిపోతామని తాను కలలో కూడా వూహించలేదని, కానీ నమ్మకం, నిజాయితీ లేనప్పుడు కూడా దాంపత్య జీవితాన్ని కొనసాగించడంలో అర్థం లేదన్నారు. అందువల్లే తీవ్రమైన ఆవేదనతో విడిపోతున్నానని, వాస్తవాలు తెలియకుండా కొన్ని పత్రికలు రాసిన వార్తలతో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యా'నని చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







