లండన్‌లోని రసెల్ స్క్వేర్‌లో ఉగ్రదాడి...
- August 03, 2016
లండన్‌లోని రసెల్ స్క్వేర్‌లో బుధవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం జరిగింది. కత్తితో దాడి చేసిన ఓ వ్యక్తి ఒక మహిళను చంపడంతో పాటు ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాడు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.00 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. స్థానికులు పోలీసులకు ఫోన్ చేయడంతో.. వెంటనే పోలీసులు దాడిచేసిన వ్యక్తిని అరెస్టుచేశారు.దాడిలో ఆరుగురు గాయపడిన విషయాన్ని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు నిర్ధారించారు. మరో మహిళకు ఘటనా స్థలంలోనే చికిత్స అందించినా, కాసేపటి తర్వాత ఆమె మరణించారు. ఇది బహుశా ఉగ్రదాడి లాంటిదే కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకోడానికి ఓ అధికారి స్టన్ గన్ ఉపయోగించాల్సి వచ్చిందని ప్రకటనలో తెలిపారు. బ్రిటిష్ మ్యూజియంకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందన్న విషయం తెలియలేదు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







