కువైట్‌లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి

- March 30, 2026 , by Maagulf
కువైట్‌లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి

కువైట్ సిటీ: కువైట్‌లోని ఓ నీటి శుద్ధీకరణ కేంద్రం పై జరిగిన దాడిలో భారతీయ కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో తమిళనాడుకు చెందిన సంతానసెల్వం క్రిష్ణన్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపింది.

భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొంది. అలాగే బాధితుడి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కువైట్ అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నామని ఎంబసీ స్పష్టం చేసింది.

ఈ దాడి ఎలా జరిగింది, దానికి కారణాలు ఏమిటి అనే అంశాలపై కువైట్ భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మృతుడి కుటుంబానికి వీలైనంత త్వరగా సమాచారం అందించి, అవసరమైన దౌత్యపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు భారత మిషన్ వెల్లడించింది.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com