ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- March 30, 2026
మస్కట్: ఒమన్ లో అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతుందని, దీంతో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు మరియు తీవ్రమైన గాలులు వీస్తాయని తెలిపింది. వాడీలు మరియు లోయలలో ఆకస్మిక వరదలు ముంచెత్తుతాయని, అదే సమయంలో విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందన్నారు.
ముసందమ్, అల్ బురైమీ, అల్ ధాహిరా, అల్ బతినా నార్త్, అల్ వుస్తా మరియు ధోఫార్ గవర్నరేట్‌లపై ప్రభావం అధికంగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసి లోయలలో వరద నీరు ప్రవహిస్తుందని, అలాగే గంటకు 10 నుండి 20 నాట్ల వేగంతో తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని వెల్లడించింది.
ఇక ఏప్రిల్ 1-2తేదీలలో ముసందమ్, అల్ బురైమీ, అల్ ధాహిరా, అల్ బతినా నార్త్, అల్ బతినా సౌత్, మస్కట్, అల్ దఖిలియా, అల్ షర్కియా నార్త్, అల్ షర్కియా సౌత్ మరియు అల్ వుస్తా గవర్నరేట్‌లలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. గంటకు 15 నుండి 30 నాట్ల (27 నుండి 55 కి.మీ./గంట) వేగంతో బలమైన గాలులు వీయవచ్చని తెలిపారు.
ఒమన్ తీరప్రాంతాలలో మోస్తరు నుండి ఉధృతమైన అలలు ఉండే అవకాశం ఉందని, వీటి గరిష్ట ఎత్తు 2 నుండి 3 మీటర్ల వరకు చేరుతుందన్నారు. అందువల్ల, వర్షాలు కురిసే సమయంలో సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.
వర్షాల సమయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వరదల వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, విజిబిలిటీని గమనిస్తూ ఉండాలని, అధికార యంత్రాంగం జారీ చేసిన అధికారిక వాతావరణ ప్రకటనలను ఫాలో కావాలని పౌర విమానయాన అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి







