బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- March 30, 2026
మనామా: బహ్రెయిన్‌లోని చిన్న తరహా వాణిజ్య రంగానికి కొత్త నిబంధనలు కోరుతూ ఐదుగురు ఎంపీలు ఒక అత్యవసర ప్రతిపాదన సమర్పించారు. ఇందులో ఆస్తి మరియు కార్ల బ్రోకరేజ్ వంటి వ్యాపారాలను లక్ష్యంగా పలు కీలక ప్రతిపాదనలు చేశారు. అనియంత్రిత బ్రోకరేజ్ సంస్థల పౌరుల ఆదాయాన్ని హరించివేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఖాలిద్ బువానాఖ్, మహమ్మద్ అల్ మారేఫీ, అహ్మద్ అల్ సల్లూమ్, జైనాబ్ అబ్దుల్ అమీర్ మరియు హిషామ్ అల్ అవధి సమర్పించిన ఈ ప్రతిపాదన, చిన్న తరహా వాణిజ్య కార్యకలాపాల పట్ల ప్రభుత్వం తన విధానాన్ని పునర్ సమీక్షించాలని కోరారు. అలాగే కొన్ని సేవా వ్యాపారాలతో పాటు ఆస్తి మరియు వాహన బ్రోకరేజ్ వంటి రంగాలకు నిబంధనలు తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు.
చిన్న ప్రాజెక్టుల మార్కెట్ కోసం ప్రభుత్వ విధానాన్ని మెరుగుపరచాలని, పౌరుల పోటీ సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని, మార్కెట్‌లో అనియంత్రిత పద్ధతులను అరికట్టడమే తమ లక్ష్యమని బువానాఖ్ అన్నారు.
చట్టవిరుద్ధమైన మార్కెట్ కార్యకలాపాలను అరికట్టడానికి తగినన్ని నియమాలు లేకపోవడంతో ఎక్కువ మంది ఇందులోకి ప్రవేశిస్తున్నారని, దీంతో చిన్న బహ్రెయిన్ వ్యాపారులు పోటీ పడటం కష్టంగా ఉందని ఎంపీలు పేర్కొన్నారు. ఇలాంటి ధోరణులు మార్కెట్‌లోని చిన్న ప్రాజెక్టుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలో పౌరుల పాత్రను విస్తృతం చేయడానికి బహ్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలకు విరుద్ధంగా ఉందని ఎంపీలు అన్నారు. మార్కెట్‌లోని చిన్న ప్రాజెక్టులపై ఇప్పటికే ఉన్న ఒత్తిడి ఆ రంగాలలో పనిచేస్తున్న పౌరుల కుటుంబ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నందున, తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీలు అన్నారు.
తాజా వార్తలు
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి







