సెప్టెంబరు ఏడో తేదీన 'రెమో' సినిమా విడుదల..
- August 03, 2016
శివకార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా తెరకెక్కుతున్న రెండో సినిమా 'రెమో'. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఏఎం స్టూడియో నిర్మిస్తోంది. ఇందులో నటనాపరంగా శివకార్తికేయన్ ఓ అడుగు ముందుకేసి నర్సుగా కూడా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మంగళవారంతో పూర్తయింది. చిత్ర యూనిట్‌లోనే సీనియర్ కళాకారుడైన సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్‌ను ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.... '' దేశం గర్వించదగిన సినిమాటోగ్రాఫర్లలో పీసీ శ్రీరామ్ ఒకరు. మా సినిమాకు ఆయన పనిచేయడం గొప్పగా భావిస్తున్నాం. అందువల్లే చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపాం. డబ్బింగ్ పనులు కొన్ని రోజుల క్రితం నుంచే జరుగుతున్నాయి. నిర్మాణాంతర పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని భావిస్తున్నాం. సెప్టెంబరు ఏడో తేదీన సినిమా విడుదల చేయనున్నామ''ని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







