చంద్రుడిపైకి తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ వ్యోమనౌక...
- August 03, 2016
చంద్రుడిపైకి తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ వ్యోమనౌకను పంపనుంది. ఫ్లోరిడా సంస్థ 'మూన్ ఎక్స్ప్రెస్' ఈ ప్రయోగం చేపట్టేందుకు అమెరికా బుధవారం పచ్చజెండా వూపింది. దీంతో వచ్చే ఏడాది సూట్కేస్ పరిమాణంలోని వ్యోమనౌకను పంపుతామని మూన్ ఎక్స్ప్రెస్ సీఈవో బాబ్ రిచార్డ్స్ వెల్లడించారు. రెండు వారాల పాటు తమ ప్రయోగం కొనసాగుతుందని తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై తాము భిన్న ప్రయోగాలు చేపడతామని, మానవ మృతదేహ అవశేషాలను కూడా అక్కడకు పంపుతామని వివరించారు. అయితే ఈ ప్రయోగం కోసం అమెరికా కొన్ని న్యాయ, నియంత్రణ నిబంధనలను సిద్ధంచేసింది. వీటికి లోబడే ప్రయోగం జరగాలని స్పష్టంచేసింది.దీంతోమరికొన్ని ప్రైవేటు సంస్థలు అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి. అంగారకుడిపైకి 2018లో వ్యోమనౌకను పంపేందుకు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ సీఈవో ఎలాన్ మస్క్ ప్రణాళికలు రచిస్తున్నారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







