కువైట్‌కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!

- April 01, 2026 , by Maagulf
కువైట్‌కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!

రియాద్: అల్-ఖఫ్జీ మరియు అల్-రుఖాయ్ సరిహద్దుల మీదుగా కువైట్ నుండి సౌదీ అరేబియాకు వచ్చే ప్రయాణికుల కోసం రెండు కొత్త బస్సు మార్గాలను ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (TGA) ప్రకటించింది.

దీనివల్ల దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు అల్-ఖైసుమాలోని అల్-ఖైసుమా అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విమానంలో ప్రయాణించాలనుకునే వారికి, అలాగే ఈ విమానాశ్రయాల ద్వారా కువైట్‌కు వెళ్ళే ప్రయాణికులకు ఉపయోగ పడుతుందని తెలిపింది.
మొదటి మార్గం దమ్మామ్‌లోని అల్-ఖఫ్జీ క్రాసింగ్‌ను కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో కలుపుతుంది. రెండవ మార్గం హఫర్ అల్-బాటిన్ గవర్నరేట్‌కు తూర్పున ఉన్న అల్-రుఖాయ్ క్రాసింగ్‌ను అల్-ఖైసుమా నగరంలోని అల్-ఖైసుమా అంతర్జాతీయ విమానాశ్రయంతో కలుపుతుంది. ప్రతి మార్గంలో రెండు మార్గాలలో ఆరు డైరెక్ట్ ట్రిప్పులు ఉంటాయి. దీనితో రోజువారీ మొత్తం ట్రిప్పుల సంఖ్య 12 కు పెరుగుతుందని అథారిటీ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com