ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- April 01, 2026
జెనీవా: ఇరాన్ దాడులను అరికట్టడానికి మరియు అంతర్జాతీయ మద్దతును సమీకరించేందుకు జెనీవాలోని గల్ఫ్ దేశాల కూటమి, మానవ హక్కుల మండలిలో తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని కువైట్ తెలిపింది.
జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలలో కువైట్ శాశ్వత ప్రతినిధి నాసర్ అల్ హయెన్ మాట్లాడుతూ .. ఇరాన్ దాడులను చూస్తే ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ముందుగా ప్లాన్ చేసుకున్న ఉద్దేశాలను ప్రతిబింబిస్తోందని, దీని వలన ప్రాంతీయ పరిధిని దాటి విపత్కర పరిణామాలు సంభవించవచ్చని హెచ్చరించారు.
అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలను ఉల్లంఘించే తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నప్పటికీ.. సంయమనం, ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చిన గల్ఫ్ సహకార మండలి దేశాలలోని నాయకత్వాన్ని అల్ హయెన్ ప్రశంసించారు.
పౌరులను, కీలక మౌలిక సదుపాయాలను, చమురు సౌకర్యాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ చర్యలు ప్రపంచ ఆహార సరఫరా చైన్ లను దెబ్బతీసే ఒక వ్యవస్థీకృత ఆర్థిక దాడికి పాల్పడటమేనని, హోర్ముజ్ జలసంధిని మూసివేస్తే ప్రపంచ ఆహార భద్రతపై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్న ఐక్యరాజ్యసమితి నివేదికలను రాయబారి గుర్తు చేశారు.
బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, జోర్డాన్ వంటి ఈ ప్రాంతంలోని పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను ఖండిస్తూ, ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ఈ దేశాలకు ఆత్మరక్షణ చేసుకునే సహజ హక్కు ఉందని మానవ హక్కుల మండలి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడాన్ని ఆయన స్వాగతించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







