AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- April 01, 2026
రష్యా సైన్యానికి చెందిన ఏఎన్-26 రవాణా విమానం క్రిమియా ద్వీపకల్పంలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు సహా మొత్తం 29 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. విమానం నేరుగా ఒక కొండను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 31న మాస్కో కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో షెడ్యూల్ ప్రకారం ప్రయాణిస్తున్న విమానంతో అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కొంతసేపటి తరువాత గాలింపు బృందం విమాన శకలాలను గుర్తించింది. అయితే అందులో ఉన్న వారిలో ఎవరూ బతికిలేరని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనతో రష్యా సైనిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. శత్రువుల దాడి జరిగిందనే కోణం లేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఏఎన్-26 తేలికపాటి సైనిక రవాణా విమానం. దీని ద్వారా తక్కువ, మధ్యస్థ దూరాలకు సరుకుతో పాటు సుమారు 40 మంది వరకు ప్రయాణికులను తరలించే సామర్థ్యం ఉంది.
గత సంవత్సరం డిసెంబర్ 2025లో కూడా రష్యాలో ఇలాంటి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతుల అనంతరం నిర్వహించిన పరీక్షా విమాన ప్రయాణం సమయంలో ఏఎన్-22 విమానం కుప్పకూలి ఏడుగురు సిబ్బంది మరణించారు. తాజా ఘటనతో రష్యా సైన్యంలో మరోసారి విషాదం నెలకొంది. ప్రమాదానికి అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







