యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!

- April 01, 2026 , by Maagulf
యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!

యూఏఈ: ఇంధన ధరల పెంపు అమల్లోకి రాకముందే ప్రజలు తమ వాహనాల్లో ఇంధనం నింపుకోవడానికి బయలుదేరడంతో నిన్న రాత్రి యూఏఈ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల చుట్టూ గూగుల్ మ్యాప్స్ ఎర్రటి ట్రాఫిక్ లైన్లను చూపించింది.

అల్ వార్కా, షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, అల్ నహ్దా, షార్జాలోని స్టేషన్లలో మరియు యూఏఈ అంతటా రాత్రి 8 గంటల తర్వాత క్యూ లైన్లు క్రమంగా పెరిగాయి. దీంతో కొందరు వాహనదారులు త్వరగా వెళ్లాలనుకున్న చోట గంట వరకు వేచి ఉండాల్సి వచ్చింది. పెట్రోల్ బంకుల వద్ద పొడవైన క్యూ లైన్లు కనిపించాయి. దీంతో కార్లు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నిలిచిపోయాయి.

సాయంత్రం పూట ఇంధనం నింపుకోవడానికి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే పట్టినప్పటికీ, రాత్రి గడిచేకొద్దీ నిరీక్షణ సమయం 30 నుండి 60 నిమిషాలకు పెరిగిందని, అయినప్పటికీ చాలా మంది వేచి ఉండటానికే మొగ్గు చూపారని పలువురు నివాసితులు తెలిపారు.

అజ్మాన్‌లో నివసించే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇమ్రాన్ ఖాన్‌కు మాట్లాడుతూ.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కరోలాలో పెట్రోల్ కొట్టించడానికి సుమారు 10 నుండి 15 నిమిషాలు పట్టిందని చెప్పాడు. కానీ మరో వాహనంలో పెట్రోల్ కొట్టించడానికి దాదాపు 30 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చిందన్నాడు. రాత్రి 8 గంటల తర్వాత, రద్దీ మొదలైందని పేర్కొన్నాడు. సుమారు 50 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉన్న టయోటా కొరోలా ఫుల్ ట్యాంక్‌పై దాదాపు 40 దిర్హమ్‌లు ఆదా చేయగా, సుమారు 73 లీటర్ల ట్యాంక్ ఉన్న నిస్సాన్ పాత్‌ఫైండర్ పై లీటరుకు 80 ఫిల్స్‌ల పెరుగుదల తర్వాత 58 దిర్హమ్‌లను మాత్రమే ఆదా చేయగలిగినట్టు వివరించాడు. 

షార్జా మరియు దుబాయ్ మధ్య కార్ లిఫ్ట్ డ్రైవర్‌గా పనిచేసే జావేద్, టయోటా హయేస్‌తో సహా తన రెండు వాహనాలలో ఇంధనం నింపడానికి దాదాపు గంటసేపు వేచి ఉన్నానని చెప్పాడు. కొత్త ధర అమల్లోకి రాకముందే ఇంధనం నింపితే, ఒకేసారి సుమారు 60 నుండి 80 దిర్హమ్స్ ఆదా అవుతుందని తెలిపాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com