కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్‌వేస్ కొత్త విమాన సర్వీసులు

- April 01, 2026 , by Maagulf
కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్‌వేస్ కొత్త విమాన సర్వీసులు

ఏప్రిల్ 13 నుంచి కువైట్–దమ్మామ్ మార్గంలో వారానికి మూడు సార్లు సేవలు

కువైట్ సిటీ: కువైట్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ జజీరా ఎయిర్‌వేస్ భారతీయ ప్రయాణికుల కోసం మరిన్ని కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది.ఏప్రిల్ 13 నుంచి విజయవాడ మరియు లక్నో నగరాలకు కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

సంస్థ సీఈఓ బద్రన్ బస్యూతి వెల్లడించిన వివరాల ప్రకారం, సౌదీ అరేబియాలోని దమ్మామ్ మీదుగా కువైట్ నుంచి విజయవాడ, లక్నోలకు నేరుగా కనెక్టివిటీ కల్పించనున్నారు. ఈ రెండు గమ్యస్థానాలకు వారానికి మూడు సార్లు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

ప్రయాణికులకు ఊరటనిచ్చే నిర్ణయం

ఈ కొత్త సర్వీసులు వందే భారత్ ఇనిషియేటివ్ కింద విమాన సేవలను విస్తరించడం, ముఖ్యంగా కువైట్‌లోని భారతీయ సమాజానికి మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ప్రారంభిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు విజయవాడ సర్వీసు ప్రారంభం కావడం పెద్ద ఊరటనివ్వనుంది. గల్ఫ్ దేశాల నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారికి ఈ కొత్త కనెక్టివిటీ ద్వారా సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణం మరింత సులభం కానుంది అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

జజీరా ఎయిర్‌వేస్ తీసుకున్న ఈ నిర్ణయం కువైట్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, ఉత్తర భారత ప్రయాణికులకు కూడా ఎంతో ఉపయోగకరంగా మారనుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com