యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- April 02, 2026
మనామా: తాము యుద్ధంలోకి వెళ్లకూడదనే ధృఢమైన వైఖరిని కొనసాగించామని, ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించడంపై దృష్టి సారించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా స్పష్టం చేశారు. అదే సమయంలో ఇరాన్ దురాక్రమణ పరిణామాలను ఎదుర్కోవడానికి పౌర రక్షణ మరియు జాతీయ అంబులెన్స్ సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తున్నారని అరబ్ అంతర్గత వ్యవహారాల మంత్రుల మండలి 43వ సమావేశంలో పాల్గొని పేర్కొన్నారు.
కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో జాతీయ సమైక్యతను కాపాడుకుంటూ, పౌరులు మరియు నివాసితులను పరిరక్షించాలనే దృఢమైన నిబద్ధతతోనే బహ్రెయిన్ పనిచేస్తుందని షేక్ రషీద్ తెలిపారు. మారుతున్న పరిస్థితిని ఎదుర్కోవడానికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఫిబ్రవరి 28న ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుండి, బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలు దూసుకొస్తున్న ముప్పులను సమర్థంగా అడ్డుకున్నాయని అన్నారు. అదే సమయంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంక్షోభ నిర్వహణ ప్రణాళికలను వేగంగా అమలు చేసి, స్వల్ప వ్యవధిలోనే సాధారణ కార్యకలాపాలను తీసుకొచ్చేందుకు పనిచేసిందన్నారు. ఈ దాడుల ఫలితంగా ప్రాణనష్టం జరగడంతో పాటు విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలు, ఇంధనం, నీరు, విద్యుత్ వంటి నిత్యావసర సేవలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
బహ్రెయిన్ స్థిరత్వానికి ప్రాధాన్యతనిస్తూ, ఉద్రిక్తతలను నివారించడానికి ప్రయత్నిస్తూనే ఉందని తెలిపారు. పౌర రక్షణ బృందాలు మరియు అత్యవసర సేవలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, రక్షణ చర్యలను బలోపేతం చేస్తున్నాయని, సమాజంలోని అన్ని వర్గాలలో అవగాహన మరియు సంసిద్ధతను పెంచేందుకు సమాచార వ్యవస్థలు మెరుగ్గా పనిచేస్తున్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు.
ప్రాంతీయ స్థాయిలో అరబ్ దేశాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉందని షేక్ రషీద్ అభిప్రాయపడ్డారు. అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి, ఉమ్మడి ప్రతిస్పందనలను మెరుగుపరచడానికి ప్రస్తుత సవాళ్లకు ఎదుర్కొవడానికి ఇది అత్యవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి ముప్పులను ఎదుర్కోవడానికి, ఉమ్మడి భద్రతా లక్ష్యాలను సాధించడానికి అరబ్ దేశాల మధ్య సహకార యంత్రాంగాలను నిరంతరం అభివృద్ధి చేయడం తప్పనిసరి అని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్









