షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- April 02, 2026
దోహా: షిప్పింగ్ కంపెనీలు అంతర్జాతీయ రోడ్డు రవాణా (TIR) వ్యవస్థ నమోదు చేసుకోవాలని జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ పిలుపునిచ్చింది. కార్యాకలాపాలను మెరుగుపరడంలో మరియు సరిహద్దు ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఇది దోహదం చేస్తుందని తెలిపింది. TIR వ్యవస్థ అంతర్జాతీయ రవాణా కార్యకలాపాలలో అధిక భద్రత మరియు విశ్వసనీయతను నిర్ధారిస్తుందని, వస్తువుల రవాణాను మెరుగుపరుస్తుందని అథారిటీ పేర్కొంది.
ఈ వ్యవస్థను స్వీకరించడం ద్వారా సరిహద్దు వద్ద వేచి ఉండే సమయాన్ని 90 శాతం వరకు తగ్గించవచ్చని, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కస్టమ్స్ హామీని అందించవచ్చని, సీల్ చేసిన సరుకుల సురక్షిత రవాణాకు ఉపయోగపడుతుందని పేర్కొంది.
ఈ ప్రాంతంలో TIRతో ఫుల్ ఇంటిగ్రేషన్ సాధించిన మొదటి దేశాలలో ఖతార్ కూడా ఒకటని తెలిపింది. సరళీకృత వాణిజ్య విధానాల నుండి ప్రయోజనం పొందడానికి, ఖతార్ ఛాంబర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా నమోదును పూర్తి చేసుకోవాలని కంపెనీలకు కస్టమ్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







