కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- April 02, 2026
కువైట్: దమ్మామ్ విమానాశ్రయం ద్వారా భారతదేశంలోని నాలుగు కొత్త గమ్యస్థానాలైన కాలికట్, తిరుచిరాపల్లి, మంగళూరు మరియు కన్నూర్‌లకు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. ఈ సర్వీసులు ఏప్రిల్ 8 నుండి ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 13వ తేదీ నుండి సౌదీ అరేబియా రాజ్యంలోని దమ్మామ్ విమానాశ్రయం ద్వారా విజయవాడ మరియు లక్నోలకు మరో రెండు అదనపు సర్వీసులను కూడా ప్రారంభిస్తున్నట్లు జజీరా ప్రకటించింది.
ఏప్రిల్ 8వ తేదీ నుండి కాలికట్కు రానుపోను విమాన సర్వీసులు వారానికి రెండుసార్లు ఆదివారాలు, బుధవారాల్లో నడుస్తాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బరతన్ పశుపతి తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ నుండి తిరుచిరాపల్లికి సర్వీసులు వారానికి రెండుసార్లు ఆదివారాలు, మంగళవారాల్లో నడుస్తాయి.
ఏప్రిల్ 9వ తేదీ నుండి మంగళూరుకు విమానాలు వారానికి రెండుసార్లు సోమవారాలు, గురువారాల్లో నడుస్తాయని, అలాగే ఏప్రిల్ 14వ తేదీ నుండి కన్నూర్‌కు వారానికి రెండుసార్లు మంగళవారాలు, శుక్రవారాల్లో సర్వీసులు నడుస్తాయని ఆయన తెలిపారు.
మార్చి 20న భారత్ కు రానుపోను కార్యకలాపాలను పునఃప్రారంభించినప్పటి నుండి, ఈ విమానయాన సంస్థ 11,000 మందికి పైగా భారతీయ ప్రయాణికులను ట్రాన్స్ పోర్ట్ చేసిందని పశుపతి పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ భారత్ లోని ఎక్కువ మంది ప్రయాణికులను వారి స్వస్థలాలకు నేరుగా అనుసంధానించడానికి వీలవుతుందని, అదే సమయంలో నిత్యావసర ప్రయాణ డిమాండ్‌కు మద్దతు ఇవ్వడం కొనసాగిస్తుందని ఆయన అన్నారు.
ఈ కొత్త మార్గాలు జజీరా ఎయిర్వేస్ ప్రస్తుత భారతీయ నెట్‌వర్క్‌కు అదనంగా చేరతాయన్నారు. ఈ నెట్‌వర్క్‌లో ఇప్పటికే అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, ముంబై, మరియు తిరువనంతపురం అనే ఎనిమిది గమ్యస్థానాలు ఉన్నాయని గుర్తుచేశారు.
ఈ విస్తరణ కీలకమైన కార్మిక వర్గాల రాకపోకలకు మద్దతు ఇస్తుందని, నిపుణులు తమ ఉద్యోగాలకు తిరిగి రావడానికి మరియు కీలక రంగాలను నిలబెట్టడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో భారత్ మరియు కువైట్ మధ్య కార్గో రవాణా మరియు సఫ్లై చైన్ లను కొనసాగించడానికి సహాయపడుతుందని పశుపతి వివరించారు.
తాజా వార్తలు
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్‌మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్









