ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!

- April 02, 2026 , by Maagulf
ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!

రియాద్ః ప్రస్తువం ప్రాంతీయంగా నెలకొన్న పరిణామాలపై సౌదీ, కువైట్ చర్చించాయి. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబాను  రియాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మంత్రులు ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై చర్చించారు. అలాగే, రెండు దేశాల మధ్య నెలకొన్న సోదరభావ సంబంధాలను, వాటిని మరింత బలోపేతం చేసే మార్గాలను కూడా విదేశాంగ మంత్రులు సమీక్షించారు. అదే విధంగా మరికొన్ని ఇతర అంశాలపై వీరు తమ అభిప్రాయాలను పంచుకున్నారని అధికార యంత్రాంగం వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com