బహ్రెయిన్ లో మానవ హక్కులు భేష్ : బ్రిటిష్ రాయబారి
- July 23, 2015
బహ్రెయిన్ లోని బ్రిటిష్ రాయబారి ఇయాన్ లిండ్సే, మానవహక్కు చట్టాల మరియు నిబంధనల విషయంలో బహ్రైన్ ముందంజలో ఉందని కొనియాడారు. ఆయన పదవీకాలం ముగిసిన సందర్భంగా మనామాలోనున్న బ్రిటిష్ రాయబార కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, తెలివైన బహ్రెయిన్ నాయకత్వం, ఈ దిశగా సరైన చర్యలు తీసుకుంటోందని, ఈ ప్రాంతంలోనే మొదటిదైన అంబుడ్స్మన్ కార్యాలయం పనితీరును ఆయన మెచ్చుకున్నారు. ఇరుదేశాల మధ్య వేళ్ళునుకున్న దృఢ సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలలో సహకార, సమన్వయాలు ఇలాగే కొనసాగాలని ఆయన ఆశించారు. గల్ఫ్ ప్రాంతంలోని రాజ్యాల ఆంతరంగిక వ్యవహారాలలో ఇరాన్ తలదూర్చడాన్ని నిరసిస్తూ, ఇటువంటి ముప్పులను ఎదుర్కోవడంలో తమదేశం ఎప్పుడు సహాయకంగా ఉంటుందని నొక్కిచెప్పారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







