సెప్టెంబర్ 15 నుంచి 'బాహుబలి 2' షూటింగ్ ప్రారంభంకానుంది
- July 23, 2015
'బాహుబలి' రెండో భాగం షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి జరగనుందని హీరో ప్రభాస్ తెలిపారు. తమ సెలవులన్ని ముగించుకుని సెప్టెంబర్ 15 చిత్రీకరణలో పాల్గొంటామని చెప్పాడు. రెండోభాగం షూటింగ్ 40 శాతం ఇప్పటికే పూర్తి చేశారు. ప్రధాన పాత్రల మధ్య సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయిందని ప్రభాస్ తెలిపారు. యుద్ధం, ఇతర కీలక సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉందని వెల్లడించాడు. 'బాహుబలి ది కన్ క్లూజన్' పేరుతో రెండో భాగం తెరకెక్కించనున్నారు. ఇందులో దగ్గుబాటి రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. జూలై 10న విడుదలైన 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు రూ.350 కోట్లు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







