ఆఫ్గానిస్థాన్‌లో విదేశీ పర్యాటకులపై తీవ్రవాదులు దాడి...

- August 04, 2016 , by Maagulf
ఆఫ్గానిస్థాన్‌లో విదేశీ పర్యాటకులపై తీవ్రవాదులు దాడి...

ఆఫ్గానిస్థాన్‌లో విదేశీ పర్యాటకులపై తీవ్రవాదులు దాడి చేశారు. అఫ్ఘాన్‌ సైన్యానికి చెందిన సిబ్బంది తమ వాహనాల్లో పర్యాటకులకు రక్షణగా వెళ్తుండగా ఈ దాడి జరగడం గమనార్హం. చెష్టె షరీఫ్‌ జిల్లాలో తాలిబన్లు మాటువేసి ఒక్కసారిగా దాడిచేశారని, ఆరుగురు పర్యాటకులు గాయపడ్డారని సైనిక ప్రతినిధి తెలిపారు. ఆ సమయంలో వాహనంలో 11 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని తెలిపారు. పశ్చిమ అఫ్ఘానిస్థాన్‌ రాష్ట్రమైన హేరత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పర్యాటకులు హేరత్‌ నుండి బమియాన్‌ వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు హేరత్‌ గవర్నర్‌ ప్రతినిధి జిలాని ఫర్హద్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com