డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!

- April 05, 2026 , by Maagulf
డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!

కువైట్ః  అన్ని దుకాణాలు, వాణిజ్య మార్కెట్లలో డ్రోన్ల అమ్మకం, పంపిణీని నిషేధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని కువైట్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఒసామా బూడాయ్ తెలిపారు.ఈ నిషేధాన్ని ఉల్లంఘించినట్లు తేలిన ఏ సంస్థనైనా మూసివేస్తామని హెచ్చరించారు. అలాగే, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపార సంస్థల ఓనర్లపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత దర్యాప్తు అధికారులకు  అప్పగిస్తామన్నారు.
అలాగే, మార్చి 3న అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఏరియల్ ఫోటోగ్రఫీ మరియు డ్రోన్ల కార్యకలాపాలపై సమగ్ర నిషేధాన్ని విధించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com