సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!

- April 05, 2026 , by Maagulf
సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!

రియాద్ః సౌదీ అరేబియా కస్టమ్స్ పోర్టుల వద్ద వివిధ రకాలకు చెందిన  748 అక్రమ సరుకులను స్వాధీనం చేసుకున్నట్లు 'జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ' (ZATCA) ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులలో 59 రకాల మాదక ద్రవ్యాలు, 197 రకాల నిషేధిత పదార్థాలు, 1,722 పొగాకు మరియు దాని ఉత్పత్తులు, నగదుకు సంబంధించిన రెండు కేసులు మరియు ఆయుధాలు, సంబంధిత పరికరాలకు సంబంధించిన నాలుగు కేసులు ఉన్నాయని తెలిపింది.
సమాజ భద్రత మరియు రక్షణకు దిగుమతులు మరియు ఎగుమతులపై కస్టమ్స్ నియంత్రణను బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ZATCA పునరుద్ఘాటించింది. ఏజెన్సీలలోని తన భాగస్వాములందరితో నిరంతర సహకారం మరియు సమన్వయంతో భద్రతను పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు ZATCA పేర్కొంది. ఈ సందర్భంగా అక్రమ రవాణా (స్మగ్లింగ్) నిర్మూలనలో పాలుపంచుకోవాలని అథారిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఇందుకోసం వారు 1910 లేదా ఈమెయిల్ ద్వారా లేదా అంతర్జాతీయ నంబర్ 009661910 ద్వారా సంప్రదించవచ్చని పేర్కొంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com