పసిడి ధర తగ్గింది..
- August 04, 2016
వరుసగా రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధర ఈరోజు రూ.200 తగ్గింది. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.200 తగ్గి రూ.31,050కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో పాటు, దేశీయ మార్కెట్లో నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సింగపూర్‌లో ఔన్స్ బంగారం ధర 0.4 శాతం తగ్గి 1,352.48 అమెరికా డాలర్లకు చేరింది.బంగారం బాటలోనే వెండి ధర కూడా తగ్గి రూ. 47వేల దిగువకు పడిపోయింది. ఈరోజు డిమాండ్ లేమితో కిలో వెండి ధర రూ.870 తగ్గి రూ.46,950కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా డిమాండ్ తగ్గడంతో సింగపూర్‌లో ఔన్సు వెండి ధర 1.13శాతం తగ్గి 20.15 అమెరికా డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







