తెలంగాణ ప్రజలకు అలెర్ట్..
- April 05, 2026
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్..రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎండల ప్రభావం ఉన్నా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 41 డిగ్రీల మార్క్ ను దాటేశాయి. శనివారం నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా రికార్డు అయింది. హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. 38.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండలతోపాటు ఉక్కపోత కూడా ఎక్కువైంది. అయితే, ఇదే సమయంలో వర్షాలు కూడా పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఐఎండీ అంచనా ప్రకారం.. తొలి రెండు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ తరువాత రెండు రోజులకు దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడే సమయంలో ఈదురుగాలులు వీచే సమయంలో సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
హైదరాబాద్ లో ఒక పక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.
వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. రైతులు రబీలో సాగుచేసిన పంటలు ప్రస్తుతం చేతికందే దశలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులు కల్లాల్లో ఆరబోశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలతో రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వరి, మొక్కజొన్న, మిరప తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసన వర్షాల కారణంగా రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్‌పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్‌లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్‌లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్‌లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







