అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు

- April 05, 2026 , by Maagulf
అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు

రియాద్: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సౌదీ అరేబియాలో ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆదేశాల మేరకు NRI TDP Saudi Arabia టీం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

ఈ సందర్భంగా పార్టీ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై “జై అమరావతి.. జై జై అమరావతి” అంటూ నినాదాలతో వేడుకలను ఉత్సాహభరితంగా మార్చారు. కార్యక్రమంలో తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి), మహేంద్ర వాకాటి, మోహన్ గురజాల, శివ దబ్బకూటి, హరీష్, రవి మేడూరి, మధు పాల్గొన్నారు.

మహిళా సభ్యుల్లో శ్రీదేవి వాకాటి, జ్యోతి, విద్య, మణి, శిరీష హాజరై సంబరాల్లో భాగమయ్యారు. అలాగే జనసేన అభిమానులు రాంబాబు బండి, ప్రగతితో పాటు పలువురు టీడీపీ అభిమానులు కూడా పాల్గొని అమరావతికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఒక చిన్న పిలుపుతోనే ఇంతమంది ముందుకు వచ్చి అమరావతికి చట్టబద్ధత వచ్చిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.రాష్ట్రం, ప్రాంతం, పార్టీ అనే భేదాలు లేకుండా టీడీపీ, జనసేన అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు.

గత ఐదు రోజుల వ్యవధిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండు కార్యక్రమాల్లో అభిమానులు భారీగా పాల్గొనడం ఆనందంగా ఉందని, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజల్లో టీడీపీపై అభిమానము రోజురోజుకు పెరుగుతూనే ఉందని నిర్వాహకుడు తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి) తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సౌదీ అరేబియాలో జరిగిన ఈ విజయోత్సవం ప్రవాసాంధ్రుల్లో అమరావతి పట్ల ఉన్న ఆత్మీయతను, తెలుగు దేశం పార్టీ పై ఉన్న మద్దతును మరోసారి చాటి చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com