అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- April 05, 2026
రియాద్: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సౌదీ అరేబియాలో ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆదేశాల మేరకు NRI TDP Saudi Arabia టీం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.
ఈ సందర్భంగా పార్టీ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై “జై అమరావతి.. జై జై అమరావతి” అంటూ నినాదాలతో వేడుకలను ఉత్సాహభరితంగా మార్చారు. కార్యక్రమంలో తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి), మహేంద్ర వాకాటి, మోహన్ గురజాల, శివ దబ్బకూటి, హరీష్, రవి మేడూరి, మధు పాల్గొన్నారు.
మహిళా సభ్యుల్లో శ్రీదేవి వాకాటి, జ్యోతి, విద్య, మణి, శిరీష హాజరై సంబరాల్లో భాగమయ్యారు. అలాగే జనసేన అభిమానులు రాంబాబు బండి, ప్రగతితో పాటు పలువురు టీడీపీ అభిమానులు కూడా పాల్గొని అమరావతికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఒక చిన్న పిలుపుతోనే ఇంతమంది ముందుకు వచ్చి అమరావతికి చట్టబద్ధత వచ్చిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.రాష్ట్రం, ప్రాంతం, పార్టీ అనే భేదాలు లేకుండా టీడీపీ, జనసేన అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు.
గత ఐదు రోజుల వ్యవధిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండు కార్యక్రమాల్లో అభిమానులు భారీగా పాల్గొనడం ఆనందంగా ఉందని, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజల్లో టీడీపీపై అభిమానము రోజురోజుకు పెరుగుతూనే ఉందని నిర్వాహకుడు తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి) తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సౌదీ అరేబియాలో జరిగిన ఈ విజయోత్సవం ప్రవాసాంధ్రుల్లో అమరావతి పట్ల ఉన్న ఆత్మీయతను, తెలుగు దేశం పార్టీ పై ఉన్న మద్దతును మరోసారి చాటి చెప్పింది.


తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







