కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- April 06, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) ఐదు కొత్త ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP) ఇ-సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీనితో ఈ రంగంలో అందించే డిజిటల్ సేవల మొత్తం సంఖ్య ఏడుకు చేరింది. లబ్ధిదారులకు అందించే సేవల మొత్తం నాణ్యతను మెరుగుపరచడం కోసం మంత్రిత్వ శాఖ విస్తృత వ్యూహంలో ఈ చొరవ ఒక భాగమని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో ప్రకటించింది.
కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సేవలు కాపీరైట్ మరియు అనుబంధ హక్కులకు సంబంధించిన ప్రక్రియలను సులభతరం చేయడానికి మరియు వేగవంతం చేయడానికి రూపొందించబడ్డాయి. వీటిలో కాపీరైట్ రిజిస్ట్రేషన్ మరియు డిపాజిట్ సర్టిఫికేట్ల కోసం దరఖాస్తులు, సర్టిఫికేట్ల జారీ, సవరణలు వంటివి ఉన్నాయి. ఈ సేవలను ఆన్‌లైన్ లో అందించడం ద్వారా పేపర్ పనిని తగ్గించడం, ప్రాసెసింగ్ సమయాలను తగ్గించడం, వినియోగదారులకు మరింత సులభమైన, అందుబాటులో ఉండే అనుభవాన్ని అందించడం లక్ష్యమని పేర్కొంది.
ఈ సేవలు కవులు, పరిశోధకులు, రచయితలు, సంగీతకారులు, కళాకారులు, డిజైనర్లు, వాస్తుశిల్పులు, మరియు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లతో సహా విస్తృత శ్రేణి లబ్ధిదారులకు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు వివిధ రంగాలలో సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, మేధో సంపత్తిని పరిరక్షించడానికి దోహద పడుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక డిజిటల్ సామర్థ్యాన్ని మరింత పెంచే సమాంతర ప్రయత్నంలో భాగంగా, మంత్రిత్వశాఖ తన ప్లాట్‌ఫారమ్ ద్వారా వస్తువుల ధరలను నమోదు చేయడానికి మొదటిసారిగా ఒక కొత్త ఎలక్ట్రానిక్ ప్రక్రియను కూడా వివరించింది. వేగవంతమైన మరియు కచ్చితమైన డేటా ఎంట్రీతో, ఈ ప్లాట్‌ఫారమ్ సమాచారం సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుందన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







