హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- April 06, 2026
మస్కట్: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలకు సంబంధించి ఒమన్- ఇరాన్ చర్చించాయి. ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల అండర్-సెక్రటరీల స్థాయిలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. హోర్ముజ్ గుండా రాకపోకలను ప్రారంభించేందుకు గల సాధ్యమైన మార్గాలను పరిశీలించారు. ఈ విషయమై ఇరుదేశాలకు చెందిన నిపుణులు పలు ప్రతిపాదనలను సమర్పించారు.
అలాగే, సిరియా రాజధాని డమాస్కస్‌లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడులను ఒమన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అంతర్జాతీయ దౌత్య నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడమే కాక, దౌత్య కార్యాలయాల అభేద్యతకు మరియు వాటి సిబ్బంది భద్రతకు హామీ ఇచ్చే ఒప్పందాలను కూడా అతిక్రమించడమేనని ఒమన్ పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







