ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- April 06, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు శాశ్వత పరిష్కారం లభించింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర అభివృద్ధి పథంలో ఒక కీలకమైన అడ్డంకి తొలగిపోయి, రాజధాని నిర్మాణానికి పూర్తిస్థాయి చట్టబద్ధత చేకూరినట్లయింది.
అమరావతికి ఏకైక రాజధానిగా శాశ్వత హోదా కల్పించేందుకు ఉద్దేశించిన “ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026”కు సర్వోన్నత ఆమోదం లభించింది.ఇప్పటికే పార్లమెంట్‌లోని ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో ఏపీ రాజధాని అమరావతి కానుంది.
అయితే అమరావతి చట్టబద్దత బిల్లును ఏప్రిల్ 1, 2 తేదీల్లో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. సుమారు 5 గంటల పాటు లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుపై చర్చలు జరిగాయి. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో అమరావతి ప్రాంత ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.
గెజిట్ నోటిఫికేషన్ ప్రధానాంశాలు
ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో పలు కీలక అంశాలను పొందుపరిచింది:
నిర్మాణ పనులు: నిలిచిపోయిన ఐకానిక్ భవనాలు (సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ), మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు ఈ నోటిఫికేషన్ మార్గం సుగమం చేసింది.
ఏకైక రాజధాని: గతంలో చర్చకు వచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కన పెట్టి, అమరావతిని పూర్తిస్థాయి పాలనా, శాసన, న్యాయ రాజధానిగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
భూ వినియోగం: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) పరిధిలోని భూములను మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు గెజిట్ ద్వారా అనుమతులు మంజూరయ్యాయి.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







