ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- April 07, 2026
అమెరికా: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం 24 గంటల్లోనే ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టగలమని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఓపిక పట్టానని, కానీ ఇక సహనం కోల్పోయానని ట్రంప్ హెచ్చరించారు.
భారీ సైనిక సన్నాహాలు
ఇరాన్ పై ఆపరేషన్ కోసం అమెరికా భారీ సైనిక సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో 4 బాంబర్లు, 55 అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్స్, 64 ఫైటర్ జెట్లు, 13 రెస్క్యూ విమానాలు, 48 ట్యాంకర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్ ప్రతిస్పందన
ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా స్పందించాయి. అమెరికా బెదిరింపులకు తాము భయపడమని స్పష్టం చేశాయి.ఇటీవల ఒక అమెరికా మిలిటరీ అధికారిని తమ అదుపులోకి తీసుకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







