మల్కాజ్‌గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- July 11, 2026
హైదరాబాద్: మల్కాజ్‌గిరిని మరింత సురక్షితమైన, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీస్, మున్సిపల్ శాఖల మధ్య కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. మల్కాజ్‌గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, ఐఏఎస్తో ఈ సమావేశం జరిగింది.
సమావేశంలో నగరంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనడం, మహిళలు, చిన్నారుల భద్రతను మరింత పటిష్ఠం చేయడం, మాదకద్రవ్యాల నిర్మూలనకు సంయుక్త చర్యలు చేపట్టడం, సీసీటీవీ కెమెరాల విస్తరణ, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
పౌరుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తూ పోలీస్, మున్సిపల్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. నగరంలో పరిశుభ్రత, ట్రాఫిక్ నిర్వహణ, నేరాల నివారణ, ప్రజా భద్రతకు సంబంధించిన కార్యక్రమాలను సంయుక్తంగా అమలు చేయడం ద్వారా మల్కాజ్‌గిరిని ఆదర్శవంతమైన నగరంగా అభివృద్ధి చేయాలని అధికారులు అభిప్రాయపడ్డారు.
ప్రజల సహకారంతో భద్రత, పరిశుభ్రత, క్రమశిక్షణకు సంబంధించిన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు రెండు శాఖలు కలిసి పనిచేయనున్నట్లు సమావేశంలో వెల్లడించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







