ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- July 11, 2026
కువైట్ సిటీ: కువైట్‌లోని ఫర్వానియా గవర్నరేట్‌లో ఓ ప్రైవేట్ నివాసాన్ని అక్రమంగా రెస్టారెంట్‌గా మార్చి నిర్వహిస్తున్న ఘటనపై అధికారులు దాడి నిర్వహించారు. పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (PAFN) తన ఫర్వానియా తనిఖీ విభాగం, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగంతో కలిసి ఈ దాడి చేపట్టింది. తనిఖీల్లో ఆ ఇంటిని ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఆహార తయారీ, విక్రయ కేంద్రంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆహార భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణ ప్రమాణాలకు సంబంధించిన పలు ఉల్లంఘనలు బయటపడటంతో సంబంధిత నిర్వాహకులపై పలువురు ఉల్లంఘన కేసులు నమోదు చేశారు.
నిందితులపై కువైట్‌లో అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లుపబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వెల్లడించింది. ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించే లేదా ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించే సంస్థలపై తనిఖీలను మరింత ముమ్మరం చేసి, కఠిన చర్యలు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







