10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- April 07, 2026
న్యూ ఢిల్లీ: పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం విమాన రవాణాపైనా పడింది. భారత్ నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 10 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దు అయినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది.
భారీగా తగ్గిన విమాన సర్వీసులు
సాధారణంగా భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు రోజుకు 300 నుంచి 350 వరకు విమాన సర్వీసులు నడిచేవి. అయితే ప్రస్తుతం యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఆ సంఖ్య 80 నుంచి 90 సర్వీసులకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా సుదూర విమాన ప్రయాణాల నేపథ్యంలో పైలట్ల ‘ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్’ నిబంధనలను డీజీసీఏ తాత్కాలికంగా సడలించింది. విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







