ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- April 10, 2026
- నూతన అధ్యక్షుడిగా మంథా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జంగా చైతన్య
- రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన నేతల స్పష్టీకరణ
- సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో సినీ రంగానికి కొత్త ఊపిరి
- ఏపీని దక్షిణ భారత సినీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా మంథా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జంగా చైతన్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతామని తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సినిమా రంగానికి అనుకూల విధానాలను అమలు చేయడంలో సీఎం ఎప్పటినుంచో సానుకూలంగా ఉన్నారని, ఆయన సహకారంతో ఏపీ సినీ రంగానికి కొత్త ఊపు తీసుకురాగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఏపీ కేంద్రంగా ఎక్కువ సంఖ్యలో చిత్ర నిర్మాణాలు జరిగేలా ప్రోత్సాహకాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని వెల్లడించారు. ప్రభుత్వ సహకారంతో స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ సదుపాయాలు, సాంకేతిక వనరులు అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో సినీ పరిశ్రమను బలోపేతంచేయడమే తమ లక్ష్యమని వివరించారు.
అలాగే, తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహకాలు అందేలా ప్రభుత్వంతో చర్చలు జరిపి, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు అనుకూల వాతావరణం సృష్టించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన 24 విభాగాల కళాకారులకు చేయూత అందించే పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







