26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- April 10, 2026
న్యూ ఢిల్లీ: రష్యాలో చిక్కుకున్న 26 మంది భారతీయులను స్వదేశానికి రప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన భారతీయులు అక్కడ ఏజెంట్ల ద్వారా మోసపోయి యుద్ధంలో చిక్కుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాధితుల కుటుంబ సభ్యుల ప్రకారం, రష్యా సైన్యంలో ఈ భారతీయులను బలవంతంగా చేర్చినట్లు తెలుస్తోంది. వారిలో కొందరు యువకులు యుద్ధంలో గాయపడగా, మరికొందరు నిర్బంధంలో ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
పిటిషినర్ తరఫు న్యాయవాది ఈ విషయాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







