అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!

- April 13, 2026 , by Maagulf
అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!

దోహా: విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో.. ఖతార్ విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ పలు మార్పులను ప్రకటించింది. ఇందులో భాగంగా అవసరమైన సర్టిఫికేట్లకు సంబంధించిన నిబంధనలను వెల్లడించడంతోపాటు కొన్ని నిర్దిష్ట వర్గాల విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేశారు.

కొత్త నిబంధనల ప్రకారం..విజిట్ వీసా (visit visa) పై ఖతార్‌కు వచ్చే విద్యార్థులకు వారి నివాస అనుమతి (residency) ప్రక్రియలను పూర్తి చేసుకోవడానికి రెండు నెలల గడువు ఇవ్వబడుతుంది. అవసరమైతే ఈ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించుకునే వెసులుబాటు కూడా కల్పించారు.  

కొత్తగా వచ్చిన విద్యార్థులకు అండగా నిలిచే లక్ష్యంతో తీసుకున్న మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్దేశిత వయో పరిమితి ప్రమాణాలకు సరిపోని విద్యార్థులు కూడా, పాఠశాల నిర్వహించే ప్రవేశ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులైతే, వారి ఇటీవలి విద్యా సర్టిఫికేట్ల ఆధారంగా అడ్మిషన్లను కల్పిస్తారు. వీటితోపాటు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ధృవపత్రాల ధ్రువీకరణ (attestation) లేకుండా వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు, ఆ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి రెండు నెలల అదనపు గడువు (grace period) ఇవ్వబడుతుంది.ఖతార్ లో దివ్యాంగులు మరియు అభ్యాస వైకల్యాలు (learning difficulties) కలిగిన విద్యార్థుల ప్రవేశానికి అనుమతించదగిన గరిష్ట వయో పరిమితిని కూడా మంత్రిత్వ శాఖ పెంచింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com