ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- April 13, 2026
ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు*
చెన్నై: పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురువు, స్వర్గీయ పోలూరి హనుమజ్జానకీరామ శర్మ కర్తృత్వంలో రూపొందిన ఉపదేశామృత తరంగిణి పునర్ముద్రణను చెన్నైలోని లోక్ భవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారి గురువు స్మృతికి పూర్వ ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంస్కృత పండితులు పూర్ణానంద శాస్త్రి తో పాటు పుస్తక సంపాదకులు తుమాటి సంజీవరావు, పోలూరి హనుమజ్జానకీరామ శర్మ కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.
కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠం ప్రథమ పీఠాధిపతులు విమలానంద భారతి వారి ఉపన్యాసాలను పోలూరి హనుమజ్జానకీరామ శర్మ సాధారణ ప్రజల కోసం పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. ఏటా వారి జయంతిని పురస్కరించుకుని, వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్జానకీ రామశర్మ స్మారక ట్రస్ట్ ద్వారా వారి సాహిత్యాన్ని పునర్ముద్రిస్తున్నారు. చెన్నపురి తెలుగు అకాడెమి వ్యవస్థాపక అధ్యక్షులు తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో పునర్ముద్రించిన ఈ పుస్తకాన్ని, ఈరోజు చెన్నై లోక్ భవన్ లో ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చొరవ తీసుకుని ఈ పుస్తకాన్ని ఆకర్షణీయంగా పునర్ముద్రించిన వారి కుటుంబ సభ్యులకు, సంపాదకత్వ బాధ్యతలు వహించిన తూమాటి సంజీవరావుకి పూర్వ ఉపరాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు.ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సామాన్యులకు సైతం అర్థం అయ్యే విధంగా ఉపదేశామృత తరంగిణి పుస్తకానికి వారు రూపకల్పన చేసిన తీరు మహోన్నతమైనదన్న వెంకయ్యనాయుడు,పోలూరి హనుమజ్జానకీ రామ శర్మ నైపుణ్యం, అనుభవం, ఆధ్యాత్మిక మార్గంలో వారి వైశిష్ట్యానికి ఈ పుస్తకం చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు.ముఖ్యంగా యువతరానికి ఈ పుస్తకాన్ని చేరువ చేసే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు









