అంబేద్కర్ జయంతి..ఘనంగా నివాళులు అర్పించిన సీఎం రేవంత్
- April 14, 2026
హైదరాబాద్: లోయర్ ట్యాంక్‌బండ్‌లో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..దేశానికి గాంధీ, అంబేడ్కర్ రెండు కళ్లన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉందో.. దేశాభివృద్ధిలో అంబేడ్కర్ పాత్ర అంతే ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను ఎవరూ మర్చిపోలేరని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ కేబినెట్లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు.కాంగ్రెస్ కేబినెట్లో దళితులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారంటూ విమర్శించారు.
గతంలో భట్టి విక్రమార్కకు సీఎల్పీ నేత హోదాను తొలగించేలా కుట్రలు జరిగాయని సీఎం రేవంత్ ఆరోపించారు. ఎస్సీ నాయకుడు స్పీకర్‌గా, ఆర్థిక మంత్రిగా ఉండకూడదా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో ఎనాడైనా డైట్ ఛార్జీలు పెంచారా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడితే ఓర్వలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానంతో పిల్లల భవిష్యత్తు మారుతుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్, పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక 67వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. 67వేల ఉద్యోగాల్లో 87శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే వచ్చాయని వెల్లడించారు.
పదేళ్ల విధ్వంసం.. వందేళ్ల నష్టానికి దారి తీసిందని సీఎం వ్యాఖ్యానించారు. ఆనాడు చేసిన అప్పులు చెల్లిస్తూ.. తప్పులు సరిదిద్దుతూ పాలన కొనసాగిస్తున్నామని వివరించారు. మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపుపై కేంద్రం గందరగోళం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 50 శాతం జనాభా ఆధారంగా.. మరో 50 శాతం జీఎస్డీపీ(GSDP) ఆధారంగా హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించిందని.. కానీ లోక్‌సభలో కొన్ని పార్టీలు అడ్డుకున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







