Dh25,000 చొప్పున బహుమతి గెలిచిన నలుగురు భారతీయ ప్రవాసులు..!!

- April 15, 2026 , by Maagulf
Dh25,000 చొప్పున బహుమతి గెలిచిన నలుగురు భారతీయ ప్రవాసులు..!!

యూఏఈః ఏప్రిల్ నెలలో 'బిగ్ టిక్కెట్ (Big Ticket)' ద్వారా నలుగురు భారతీయ ప్రవాసులు ఒక్కొక్కరికి Dh25,000 చొప్పున బహుమతిని గెలుచుకున్నారు. విజేతలలో మొదటి వ్యక్తి, భారతదేశంలోని మంగళూరుకు చెందిన 50 ఏళ్ల దుబాయ్ నివాసి వీరా లోబో. ఈస్టర్ పండుగ రోజున ఆమె విజేతగా నిలిచారు. అదేరోజు తన పుట్టినరోజని, విజేతగా నిలవడం సంతోషంగా ఉందని చెప్పారు. తాను మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇందులో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. అలాగే, తన వాటాలో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని తాను భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, 2022 నుండి యూఏఈలో నివసిస్తున్న కేరళవాసి అంజిల్‌ నజార్.. సోషల్ మీడియా ద్వారా 'Big Ticket' గురించి తెలుసుకుని, రెండేళ్ల క్రితం ఇందులో పాల్గొనడం ప్రారంభించారు. సాధారణంగా అతను తన స్నేహితుల బృందంతో కలిసి ఇందులో పాల్గొనేవారు. కానీ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుని కొన్న టికెట్‌ అతడిని విజేతగా నిలిపింది. 'Air Arabia'లో విమాన సాంకేతిక నిపుణుడిగా (aircraft technician) పనిచేస్తున్న ఈ 33 ఏళ్ల యువకుడికి ఇదే మొదటి విజయం. గెలుచుకున్న బహుమతితో ఏం చేయాలనే దానిపై అతను ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపాడు.
షార్జాలోని 'Gems' పాఠశాలలో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల అమృత బాబు.. గత ఎనిమిదేళ్లుగా యూఏఈలో నివసిస్తున్నారు. మొదట ఆన్‌లైన్‌లో బిగ్ టికెట్ గురించి తెలుసుకుని, అప్పుడప్పుడు ఇందులో పాల్గొంటున్నారు. తను నాలుగోసారి కొన్న టికెట్ తో విజేతగా నిలిచినట్లు తెలిపారు.బహుమతి మొత్తాన్ని తెలివిగా ఉపయోగించాలని తాను భావిస్తున్నట్లు అమృత చెప్పారు.
భారత్ లోని కేరళకు చెందిన మరో ప్రవాసి ఫాతిమా అఫీదా కూడా బిగ్ టికెట్ ద్వారా విజేతగా నిలిచారు. ఆమె భర్త ఆమె పేరు మీద టికెట్‌ను కొనుగోలు చేసి, ఆమె తరపున ఒక స్టేట్‌మెంట్‌ను పంచుకున్నారు. తాను గత 15 సంవత్సరాలుగా కువైట్‌లో ఉంటున్నట్టు, 5 సంవత్సరాల నుండి బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్నట్టు తెలిపాడు.  
ఇక ఏప్రిల్ నెలలో ఈ ప్రమోషన్‌లో భాగంగా Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ ఉంది. మే 3న జరిగే లైవ్ డ్రాలో ఒక పార్టిసిపెంట్ ఈ గ్రాండ్ విన్‌ను దక్కించుకునే అవకాశాన్ని పొందుతారు. అదే రాత్రి, ఐదుగురు విజేతలు ఒక్కొక్కరు Dh1 మిలియన్ చొప్పున కన్సోలేషన్ ప్రైజ్‌లను అందుకుంటారు. దీనితో ఈ నెలలో గ్యారెంటీగా మిలియనీర్లయ్యే వారి సంఖ్య ఆరుకు చేరుతుంది. ఇంకా మూడు వారపు ఇ-డ్రాలు మిగిలి ఉన్నాయి. వీటిలో నలుగురు విజేతలు ఒక్కొక్కరు Dh25,000 అందుకుంటారు. ఈ డ్రాలు ఉదయం 11 గంటలకు బిగ్ టికెట్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com