అల్-అహ్మదిలో 128 నోటీసులు జారీ.. కఠిన చర్యలు..!!

- April 15, 2026 , by Maagulf
అల్-అహ్మదిలో 128 నోటీసులు జారీ.. కఠిన చర్యలు..!!

కువైట్ః కువైట్ లోని అల్-అహ్మది గవర్నరేట్‌లోని భద్రతా విభాగం నిర్మాణ  ప్రదేశాలలో పర్యటించి, భద్రతా మరియు రక్షణ చర్యలను పరిశీలించింది. భద్రతా విభాగ టీమ్ ఆ ప్రదేశాలలో ఉల్లంఘనలను పర్యవేక్షించింది. ఈ సందర్భంగా భద్రతా మరియు రక్షణ సంబంధిత నిబంధనలను పాటించనందుకు 128 నోటీసులను జారీ చేసినట్టు తెలిపింది.  క్షేత్రస్థాయిలో పర్యవేక్షక బృందం పర్యటనలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com