ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- April 16, 2026
దోహా: మిడిలీస్టులో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు హెచ్ఈ డొనాల్డ్ ట్రంప్.. అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీకి ఫోన్ చేసి మాట్లాడారు. తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా అంతర్జాతీయ సముద్ర భద్రతపై ఇటీవలి ఉద్రిక్తతల ప్రభావం మరియు ప్రపంచ ఇంధన మార్కెట్లు, సరఫరా చైన్ ల స్థిరత్వంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రపంచ ఇంధన మార్కెట్ల స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంలో ఖతార్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందని, అలాగే అంతర్జాతీయ భాగస్వాములకు తన బాధ్యతలను నెరవేర్చడానికి కట్టుబడి ఉంటుందని హెచ్‌హెచ్ అమీర్ పునరుద్ఘాటించారు.
అదే సమయంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయడం, అలాగే ప్రాంతీయ మరియు ప్రపంచ భద్రతను పరిరక్షించే విధంగా సంక్షోభాలను పరిష్కరించడానికి దౌత్యపరమైన మార్గాలను ప్రాథమిక మార్గంగా ఎంచుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రాంతీయ మధ్యవర్తిత్వంలో ఖతార్ దేశం పోషిస్తున్న పాత్రను, స్థిరత్వానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు ప్రశంసించారు. ముఖ్యంగా ఇంధన భద్రత మరియు ప్రపంచ మార్కెట్ స్థిరత్వం వంటి వివిధ అంశాలపై ఖతార్ తో సమన్వయం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ ఆసక్తిగా ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









